Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత నీటి పథకం నమోదు చేసుకోవాలి
- నీటి సరఫరా, నాణ్యత, సీవరేజి నిర్వహణపై ప్రత్యేక దృష్టి
- క్షేత్రస్థాయిలో ఎండీ పర్యటన
- పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా ప్రజల అవసరాన్ని బట్టి జలమండలి తాగు నీరు అందిస్తోంది. సీవరేజీ పనులను సైతం జలమండలి చేపట్టింది. ఈ సివరేజీ పనుల విషయంలో కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఎండీ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో స్వయంగా ఎండీ దానకిషోర్ బస్తీల్లో పర్యటిస్తున్నారు. బస్తీల్లో నీటి సరఫరా, నాణ్యత, సీవరేజీ నిర్వహణ, రిజర్వాయర్ లెవల్ మానిటరింగ్‌ను ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణకు సైతం ఆదేశించారు. పలువురు అధికారులపై సీరియ స్‌గా చర్యలు తీసుకున్నారు.
బస్తీల్లో పర్యటన
స్వయంగాస్థానికులను నుంచి సమస్యలను తెలుసుకునేందు ఎండీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సోమవారం తార్నాకా, లాలాపేట్‌లో పర్యటించారు. తార్నాకలో జరుగుతున్న మ్యాన్హౌల్ మరమ్మత్తు పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కచ్చితంగా సేఫ్టీ ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పనులు జరుగుతున్నప్పుడు కచ్చితంగా సదరు పని వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తాగునీటిలో సమస్యలేకుండా చూడాలి : ఎండీ
తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యల్లేకుండా జలమండలి అధికారులు చూడాలి. నీటి నాణ్యతలో జాగ్రత్తలు తీసుకోవాలి. లోప్రెషర్ సమస్యల్లేకుండా చూడాలి. ఇప్పటికీ ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోవడానికి ఉంది. నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుని ప్రభుత్వం ఇస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనంతరం తార్నాకలోని జలమండలి రిజర్వాయర్ ప్రాంగణంలోని క్లోరినేషన్ రూంను పరిశీలించారు.