Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కాలనీవాసులతో సభ
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్లో పలు కాలనీలలో రిజిస్ట్రేషన్ సమస్య అనేక సంవత్సరాలనుండి పెండింగ్‌లో ఉంది. గత శాసన సభ ఎన్నికల ముందు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రజలకు రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కారం చేస్తాను అంటు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చుటకు సమయం ఆసన్నమైంది. మంత్రి కేటీఆర్ బుధవారం రిజిస్ట్రేషన్ సమస్యకు ముగింపు పలుకుతు జీఓను తీసుకువచ్చి ఎల్బీనగర్ ప్రజలకు ఇవ్వనున్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే తిరిగి ఎన్నికలలో పోటీ చేయను అంటు ప్రకటించారు. కరోనా రావడంతో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు ఆలస్యం అయింది. 20 సంవత్సరాలనుండి పలు కాలనీలలో రిజిస్ట్రేషన్ సమస్య పెండింగ్‌లో ఉంది. ప్లాట్ల యజమానులు జీహెచ్ఎంసీ అనుమతి లేకుండ ఇండ్లు నిర్మించుకొన్నారు. రిజిస్ట్రేషన్ సమస్యకు ప్రభుత్వం ముగింపు పలుకుతు జీఓ విడుదల చేసింది. కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్, నాగోల్ డివిజన్ పరిధిలోని రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేసి ప్రజలకు తీపి కబురు అందించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్‌రెడ్డి కోరారు. బి.ఎన్.రెడ్డి. నగర్ డివిజన్ మరియు నాగోల్ డివిజన్ పరిధిలోని రిజిస్ట్రేషన్ సమస్యలను, కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దష్టికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోరాటం పలించింది. బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్లోని ఎస్.కే.డి. నగర్, సాగర్ కాంప్లెక్స్, బి.యన్.రెడ్డి.నగర్, శ్రీపురం కాలనీ, వైదేహినగర్, శ్రీరామ్ నగర్,సాహెబ్ నగర్ కాలన్,విజయ నగర్ కాలనీ,నాగోల్ డివిజన్ పరిధిలోని అరుణోదయ కాలనీ,కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, గణేష్‌నగర్ కాలనీ, లలితానగర్ కాలనీ,సాయినగర,్ సౌత్కాలనీ, సాయినగర్ డెవలప్మెంట్ సొసైటీ, మల్లికార్జున హిల్స్, ఈశ్వర పూరి కాలనీ, అవంతి కాలనీ, చంపాపేట డివిజన్ పరిధిలోని రాజిరెడ్డి కాలనీ, సుల్తాన్ వాల్వా, హస్తినాపురం డివిజన్ పరిధిలోని జనార్దన్ రెడ్డి నగర్ కాలనీల నందు నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్య నేటితో పరిష్కారం లభించింది. కొందరి ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్ల ఇబ్బందులు పడడం గరిగిందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్ సానుకూలంగా స్పందించి వెంటనే చీఫ్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. దీపావళి వరకు మంచి తీపి కబురు వస్తుంది అని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. కాలనీవాసులు అందరు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు అని, తప్పకుండా శాశ్వత పరిష్కారం చేస్తాము అని ఎమ్మెల్యే తెలిపారు. చెప్పిన విధంగా ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ సమస్యకు ముగింపు పలుకుతు జీఓ తీసుకువచ్చారు. ఎల్బీనగర్లో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ ప్లాట్స్ కొనుగోలు చేశారు. అసైన్డ్‌మెంట్ స్థలాల బాధను గుర్తుపెట్టుకొని పట్టుదలతో ఎమ్మెల్యే కృషి చేయడం జరిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్ సమస్యకు ముగింపు పలికారు.