Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్
- కేసీఆర్ , కేటీిఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
నవతెలంగాణ-హస్తినాపురం
దశాబ్ద కాలం నుండి ఎల్బీనగర్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్, సామ రమణరెడ్డిలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కే.టీ.ఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం పలువురు కాలనీ వాసులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజక వర్గం పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ వైదేహినగర్, బిఎన్ రెడ్డి నగర్, ఎస్కెడి నగర్, శ్రీరామ్‌నగర్, సాగర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీ, సామనగర్, విజయనగర్ కాలనీ, సీబీఐ కాలనీ, నాగోల్ డివిజన్ సాయినగర్ కాలనీ, కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, అరుణోదయ నగర్ కాలనీ, జైపురి కాలనీ, లలితానగర్, ఈశ్వరపురి కాలనీ, గణేష్ నగర్ కాలనీ, మన్సూరాబాద్ డివిజన్ బాలాజీనగర్, శ్రీరామా హిల్స్, పద్మావతి నగర్, వివేకానందనగర్, రాగాల ఎనక్లేవ్, సీిఆర్ ఎన్క్లేవ్, బ్యాంక్ కాలనీ, కాస్మోపాలిటన్ కాలనీ, కమలానగర్, చంపాపేట డివిజన్ మారుతీనగర్, ఈస్ట్ మారుతీనగర్, రాజిరెడ్డి నగర్ కాలనీ, మాధవనగర్, ఎస్వి కాలనీ, శ్రీనిధి కాలనీ, హస్తినాపురం డివిజన్ జనార్దన్‌రెడ్డి నగర్ కాలనీలలో గత దశాబ్ద కాలంపైగా పెండింగ్‌లో ఇళ్ల స్థల రిజిస్ట్రేషన్, ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తామని గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని, వారికి నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైదెహి నగర్ కాలనీ మాజీ ఉపాధ్యక్షులు బి.రాజేందర్ రెడ్డి, పి.వెంకయ్య, మహబూబ్ ఆలీ, పల్లె కృష్ణ గౌడ్, శేఖర్, ప్రశాంత్ గౌడ్, పద్మనాయీ, కిషన్ గౌడ్, పద్మ,స్వప్న లతో పాటు పలువురు నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.