Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్
విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో ముందుండి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని పీర్జాదిగూడ మేయర్ తెలంగాణ రాష్ట్ర రూప్ స్కిప్పింగ్ ప్రెసిడెంట్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చౌదర్‌గూడ గ్రామపంచాయతీకి చెందిన రోటర్ డ్యాం అంతర్జాతీయ పాఠశాలలో రూప్ స్కిప్పింగ్‌లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు జన్మదిన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యుత్‌తోపాటు క్రీడల్లోనూ అన్ని రంగాలను ముందుండాలని ఆయన అన్నారు. ఢిల్లీలోని తాల్ కటోర్ స్టేడియంలో ఈనెల 17 నుండి 19 వరకు ఆర్ఎస్ఎఫ్ఐ రూప్ స్కిప్పింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలను నిర్వహించారని, ఈ పోటీలలో మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రం నుండి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని 8 బంగారు పతకాలు, 9 వెండి పతకాలు, 18 కాంశ్య పతకాలు అందులో రోటర్ డ్యాం విద్యార్థులు7 బంగారు పతకాలు, 1 వెండి పతకం, 2 కాంశ్య పతకం తెలంగాణ విద్యార్థులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు ఎంతో సంతోషంకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రోటర్ డ్యామ్ అంతర్జాతీయ పాఠశాల డైరెక్టర్ శ్వేతారెడి,్డ ప్రిన్సిపల్ రూపారెడ్డి, రాష్ట్ర రూప్ స్కిప్పింగ్ జనరల్ సెక్రటరీ భానుప్రకాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.