Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఎమ్మెల్యే ఆదేశాలతో ఆటోనగర్ డంపింగ్ యార్డు పరిసరాల్లోని డ్రైనేజీ వ్యర్థ జలాల నుండి గాలిలోకి వెలువడే చెడు రసాయన కాలుష్యాన్ని నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇండిస్టీయల్ అధికారులు, రంగారెడ్డి జిల్లా జాయింట్ డైరెక్టర్ పర్సనల్గా అధికారులతో మాట్లాడి అభ్యర్థన పత్రాలను ఇచ్చి, ఎమ్మెల్యేతో ప్రతి ఆఫీస్లో కూడా ఫోన్ ద్వారా మాట్లాడారు.
అన్ని కార్యాలయాల అధికారులు తమకు అనుకూలంగా స్పందించారని కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డంపింగ్ యార్డ్ ఐక్యకార్యాచరణ కమిటీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజుతో కలిసి విజయశ్రీ కాలనీ ప్రధాన కార్యదర్శి మార్గం రాజేష్, జడ్జస్ కాలనీ ఫేస్-1, నుండి అధ్యక్షులు ఆంజయ్య గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్, వాసు యాదవ్, జడ్జస్ కాలనీ ఫేస్-2 నుండి చొక్కళ్ల వీరాచారి, యాదగిరేందర్ శిరందాసు, శుభోదయ కాలనీ నుండి అధ్యక్షులు బద్దం వెంకట్ రెడ్డి, సహార స్టేట్స్ నుండి విజయ, కిరణ్, కార్తీక్, బాల్ రెడ్డి నగర్ నుండి రవి, సురేష్, తదితర సభ్యులు పాల్గొన్నారు.