Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వసూలైంది రూ.169 కోట్లే
- గడువు కోసం జీహెచ్ఎంసీ ఎదురుచూపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో చాలాకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి సర్కార్ మరోసారి వన్‌టైం స్కీం (ఓటీఎస్) ప్రకటించింది. 2020లో మాదిరిగానే ఓటీఎస్‌కు స్పందన నామమాత్రంగానే ఉంది. రాష్ట్ర ఖజానాలో నిధుల్లేక పోవడంతో మరోసారి పాత బకాయిలపై సర్కార్ దృష్టి సారిం చింది. జీహెచ్ఎంసీని సైతం నిధుల కొరత వేధిస్తోంది. ఎస్ఆర్ డీపీ, సీఆర్ఎంపీ, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం, ఉద్యోగుల వేతనాలు బల్దియాపై పెనుభారంగా మారాయి. ఈ తరుణంలో ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి సర్కార్ చర్యలు ప్రారంభించింది. 2020 నవంబర్ 15వరకు గడువు ఇచ్చిన ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. ఈ సారి అక్టోబర్ 31వరకు అవకాశం కల్పించారు. అయినా ఆశించినస్థాయిలో వసూలు కాలేదు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) దృష్టిసారించింది. ఇప్పటికే అప్పులపాలైన బల్దియా ఆదాయం కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. సర్కార్ ప్రకటించిన ఓటీఎస్‌లో భాగంగానే 15-20ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఆస్తిపన్ను బకాయిలు చెల్లిస్తే 90శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్న విషయం విదితమే. బకాయిలతోపాటు 10శాతం వడ్డీని అక్టోబర్ 31లోగా చెల్లించాలని బల్దియా ప్రకటించింది. ఈ స్కీమ్‌ను వినియోగించుకునేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అయినా ఫలితంలేకుండపోయింది.
రూ.169కోట్లే
జీహెచ్ఎంసీ పరిధిలో 5లక్షల మందికిపైగా ఆస్తిపన్ను పాత బకాయిలుదారులు ఉన్నారు. కానీ ఓటీఎస్‌లో ఆస్తిపన్ను చెల్లించింది 59,838 మందినే. ఓటీఎస్ ప్రకటించి నప్పటి నుంచి 51,062 మంది రూ.102.65కోట్లు చెల్లిస్తే అక్టోబర్ 31న ఒక్కరోజులోనే 8776 మంది రూ.67.18కోట్లు చెల్లించారు. అయితే గతేడాది మాదిరిగా నవంబర్ వరకు గడువు పొడిగిం చాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం గడువు పొడిగిస్తుందా? లేదా? చూడాల్సిందే.
భారీగా బకాయిలు
గ్రేటర్లో 16లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపు దారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం లో సుమారు 10లక్షల మంది రూ.1,495కోట్లు చెల్లించారు. మరో 5లక్షల మంది నుంచి రూ.1,500 కోట్లకుపైనే ఆస్తిపన్ను బకాయిలతో పాటు వీటిపై వడ్డీ రూ.1,000కోట్లు రావాల్సి ఉంది. అయితే ఓటీఎస్‌లో 90శాతం వడ్డీ మాఫీ చేయడంతో జీహెచ్ఎంసీ ఖజానాకు పాతబకాయిలు సుమారు రూ.1,500కోట్లతోపాటు 10శాతం వడ్డీ రూ.100కోట్లు కలిపి మొత్తం రూ.1,600కోట్లు రావాల్సి ఉంది. అయితే 2020 నవంబర్ 15వరకు కొనసాగిన ఓటీఎస్‌కు నామమాత్రంగానే స్పందన వచ్చింది. పాతబకాయిలు, వడ్డీ కలిపి రూ,1547 కోట్లకుగాను రూ.400కోట్లు మాత్రమే వసూలైంది. ఈసారి రూ.169కోట్లు మాత్రమే వసూలైంది.