Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులు ప్రజలతో విశేష స్పందన లభించింది. దారి పొడవునా స్వాగతం పలికింది. కాంగ్రెస్ జూడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్ర మంగళవారం అరాంఘర్ మీదుగా ఉదయం పది గంటలకు తాడ్బన్ కు చేరుకుంది. అక్కడ రాహుల్ లెగ్గెసీ ప్యాలెస్‌లో విరామం తీసుకున్నారు. అనంతరం సాయంత్రం మూడున్నర గంటలకు బహదూర్‌పురా మీదుగా పురానాపూల్ దర్వాజాకు చేరుకున్నారు. పురానాపూల్ చౌరాస్తా నుండి మండలి అంజన్‌కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కతిక కార్యక్రమాలు బోనాలు పోతరాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అక్కడ నుండి యాత్ర ప్రారంభించి మూసాబౌలి, ముర్గీషాక్ల మీదుగా చారిత్రాత్మక చార్మినార్‌కు చేరుకు న్నాడు. చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావనా సమితి ప్రతినిధి నిరంజన్ ఆధ్వర్యంలో సద్భావన స్థూపం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుండి జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. మొదట వందేమాతర గీతం ఆలాపించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ధ్వజ్ గీతను ఆలపించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేదికపై జూడో యాత్ర చైర్మెన్ దిగ్వి జయ్సింగ్ ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ .జయరాం రమేష్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆయనతో పాటు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మంది అనిల్‌కుమార్ యాదవ్ లతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కన్నయ్యలాల్ రాహుల్ గాంధీకి కండువాలు కప్పారు. అనంతరం ర్యాలీ గుల్జార్‌హౌస్ మదీనా అఫ్జల్ గంజ్ మీదుగా గాంధీభవన్‌కు చేరుకుంది. దారిపొడవునా పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.