Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కేంద్ర ప్రభుత్వం నిర్మించిన నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కుత్బుల్లాపూర్ దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో సూరారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈసందర్భంగా కమిటీ చైర్మెన్ బేకు ఆనంద్ బాబు మాట్లాడుతూ నూతన పార్లమెంట్‌కు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల ఆయనకు భారత జాతి రుణం తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. దేశమంతటా దళిత సంఘాలు ముందుకు వచ్చి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని పోరాడాల్సిన సమయం అని సూచించారు. అనంతరం దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో చలో ట్యాంక్‌బండ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అవిజే జేమ్స్, బుడాలా విజరు భాస్కర్, కట్టాం దేవయ్య, సిల్వర్ శ్రీనివాస్, రసమల్ల యాదగిరి, సాంబ, రాణి, చిన్ని, మల్లిక, మహేష్ తదితరులు పాల్గొన్నారు.