Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్
నవతెలంగాణ-దుండిగల్
కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాటం చేయాలని సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రగతినగర్ సుందరయ్య భవన్లో సీఐటీయూ బాచుపల్లి రెండో మహా సభ నిర్వహించారు. ఈసమావేశానికి సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. 44 లేబర్ యాక్ట్‌లను 4 కోడ్స్‌గా కుదించి అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కార్మికులు చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నారని, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు మాత్రం లక్షల్లో తీసుకుంటున్నారని ఇది దుర్మార్గం అని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల, వలస కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాబోయే కాలంలో సీఐటీయూ అన్ని రంగాల కార్మికులను ఐక్యం చేసి ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తుందన్నారు. అనంతరం సీఐటీయూ సీనియర్ నాయకులు వెంకటరామయ్య మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉండి పోరాట నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మోడీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని, సంపన్న వర్గాలకు ప్రజాధనాన్ని దారాధత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం 19 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ కన్వీనర్‌గా ఎన్ బాలపీరు, కో కన్వీనర్ వెంకటరాజ్యం, మండల కమిటీ సభ్యులు పి పెంటయ్య, మద్దిలేటి ఎల్లమ్మ, లిమేందర్, శీను, అంజి, పి స్వామి, వెంకటేశ్వర్లు, ప్రభుదాస్, రమేష్ .రామ్ రెడ్డి, మల్లేష్, మీనా, సంధ్య, సోని, జ్యోతి, శంకర్రావు తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం చంద్రశేఖర్, జిల్లా నాయకులు కృష్ణ నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.