Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పరిపాలన భవన్ ముట్టడించారు. యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని, పీజీ విద్యార్థులకు మెస్ డిపాజిట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, యూనివర్సిటీలో గాడితప్పిన అకాడమిక్ వాతావరణాన్ని సరిదిద్దాలని కోరారు. యూనివర్సిటీలో అనైతికంగా వందల రెట్లు పెంచిన పీజీ, ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను తగ్గించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను, సరిపడా నూతన హాస్టల్ భవనాలను తక్షణమే నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. ఓయూ అనుబంధ కళాశాలలైన నిజాం కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, కోఠి ఉమెన్స్ కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజీలపై వైస్-ఛాన్సలర్ చూపుతున్న సవతి తల్లి ప్రేమను వీడనాడి, ఆయా కాలేజీలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కార్య్రమంలో రాష్త్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్ శ్రీహరి, ఓయూ విభాగ్ కన్వీనర్ ఎం. సుమన్ శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేష్, నాయకులు జీవన్, శ్రీనివాస్, శ్రీధర్, అశోక్, వికాస్, నదీం, వెంకట్, కోటి, సిరివెన్నెల, వర్ష, సాహితీ పాల్గొన్నారు.