Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
గోషామహల్ నియోజకవర్గంలోని చుడీబజార్‌లో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ లోహియా మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ని క్వాలిటీ కంట్రోల్ ఈఈ మోహన్ సింగ్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్మించిన గోడలను గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులను పైకప్పుల క్వాలిటీని పరిశీలించారు. నమూనాలను సేకరించి పరిశీలన చేశారు. ఇంకా పూర్తికాని పనులను అధికారులను, స్థానిక సంఘం ప్రతినిధులు మాదిగ బంధుమిత్ర సంఘం సభ్యులు ఎం.వెంకటేష్, ఆర్.సుమన్ కుమార్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యతను పాటించాలని నాణ్యత లోపాలు చోటు ఇవ్వకుండా నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు.నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. క్వాలిటీ లేకుండా నాణ్యత లోపాలు ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.