Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-నాగోల్
తమ అభివృద్ధిని తామే నిర్వహించుకునే దిశగా చైతన్యమై ఉత్పత్తిలో భాగస్వాములైననాడే దళితు లు సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందనే ఉద్దేశంతో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని రూపకల్పన చేసిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దళిత బంధు పథకం కింద ఎంపికైన కొత్తపేట డివిజన్ రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన ఇటికల యాదగిరికి మంజూరైన సెంట్రింగ్ సామాగ్రిని గురువారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చారిత్రా త్మకమైన నిర్ణయమని, అర్హులైన దళితులకు ఈ పథకంలో కుటుంబానికి 10లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహా యాన్ని అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. పరిశ్రమ లను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకొని దళిత సమాజం వ్యాపార వర్గంగా ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దళితు లను వ్యాపారాలుగా తీర్చిదిద్దడమే కాకుండా వారు వ్యాపార పరంగా ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా అధికారులు ఆలోచనలు చేయాలని చెప్పారు. దళిత బంధు పథకంలో ఎంపికైన బబ్జిదారులకు తొమ్మిది లక్షల 90వేల రూపాయలను చెల్లించి మిగిలిన పదివేల రూపాయలకు ప్రభుత్వం వాటాగా మరో 10 లక్షల రూపాయలను కలిపి దళితరక్షణ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో దురదృష్టవశాత్తు మరణించిన లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ఇది ఒక ఇన్సూరెన్స్ వలె ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి, కొత్తపేట డివిజన్ టీిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, వెంకటేష్‌గౌడ్, రమేష్, దీప్లాల్, చంద్రశేఖర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.