Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
ఈనెల12న తెలంగాణలోని రామ గుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించటానికి విచ్చేయుచున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నినదించారు. గురువారం సీపీఐ హయత్‌నగర్ మండల కార్యదర్శి సామిడి శేఖర్‌రెడ్డి అధ్యక్షతన మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో అనుసరిస్తున్న ప్రజా కార్మిక, కర్షక, వ్యతిరేక విధానాలపై, ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ ప్రయివేటీికరిస్తూ కారుచౌకగా తన మిత్రులకు కట్టబెట్టడాన్ని, చట్టం చేస్తుండడానికి నిరసనగా, అలాగే ఎన్నో సమరశీల పోరాటాల ద్వారా సాధించిన కార్మిక చట్టాలను, 4 కోడులుగా చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, అలాగే తెలంగాణ కొంగు బంగారం మన రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి సింగరేణిని ప్రయివేటుపరం చేయడానికి నిరసనగా, పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకపోవడం బయ్యారం, స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ, నవోదయ విద్యాలయాలు, ఐఏఎం.ఐ.ఐ.టీలను ఏ ఒక్కటి కూడా మన రాష్ట్రానికి ఇవ్వకపోవడానికి నిరసనగా, రిజర్వేషన్లను క్రమేపి ఎత్తి వేసే కుట్ర, కాషాయికరణను విద్యారంగంలో చొప్పించే కుట్ర అడ్డు, అదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడానికి నిరసనగా నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్ని మండల నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలతో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సక్రు పాల్గొన్నారు.