Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
దశలవారీగా గ్రామ అభివృద్ధికి కృషిచేస్తానని గౌరెల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ తుడుం మల్లేష్ అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభను ఉద్దేశించి సర్పంచ్ తుడుం మల్లేష్ మాట్లాడుతూ
సీసీ రోడ్లు, భూగర్భ డ్రయినేజీ, వీధి దీపాలు, మంచినీరు మొదలగు మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషిచేస్తానని తెలిపారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి సాధికారత కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సహకార సంఘం చైర్మెన్ లెక్కల విఠల్ రెడ్డి, జిల్లా
కో ఆప్షన్ సభ్యులు అక్బర్ అలీ ఖాన్ల సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రజా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.