Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సరూర్‌నగర్
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్ నామమాత్రంగా 1000 రూపాయలు ఉందని కనీస పెన్షన్ 10,000లకు పెంచాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. గురువారం ఆర్కే పురంలోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో సభాధ్యక్షులు బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రథమ మహాసభల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు కనీస పెన్షన్ కనీస వసతులు కల్పించాలని ఉన్నా ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదన్నారు. భారత రాజ్యాంగం అనేది సంక్షేమ రాజ్యాంగమని కానీ హమాలు ఆము లేచి అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.
రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం సాధించాలని ఉంది కానీ కార్యరూప దాల్చకపోవడంతో సామాజిక అంతరాలు ఇంకా ఉంటున్నాయి అన్నారు. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే పెన్షనర్ల సమస్యలు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. అమలు కాకపోతే ఉద్యమాలు కూడా ఆపద్ధతిలోనే ఉండాలన్నారు. ఈపీఎస్ 95 జాతీయ అధ్యక్షులు ఎం.ఎన్.రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి మచ్చ రంగయ్య, రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావులు మాట్లాడుతూ కనీస పెన్షన్‌ను 10000 చెల్లించాలన్నారు. ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్‌కి మమ్మల్ని పరచాలని, పెన్షనర్లకు ఆదాయ పన్ను రద్దు చేయాలన్నారు. 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ చెల్లించాలని, పెన్షనర్ల బెనిఫిట్లను వాయిదా పద్ధతిలో కాకుండా ఏక మొత్తంలో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు నాగయ్య, కూరపాటి నాగేశ్వరరావు, కో కన్వీనర్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.