Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నిరసనలు
- తెల్లవారుజాము నుంచే విద్యార్థులను వసతి గృహాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు
నవతెలంగాణ ఓయూ
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యలో ఓయూలో ఉదిక్త్రత చోటుచేసుకుంది. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ పలు వురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. అయితే నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పలువురు విద్యార్థులను పోలీ సులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున నుంచే వసతి గృహాల్లో విద్యార్థులను అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఓయూ కార్యదర్శి రవి నాయక్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య ఏర్పాటును హైదరాబాద్ కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటికి, దానిని గుజరాత్ కు తరలించారని తెలిపారు. పీహెచ్‌డి స్కాలర్లకు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఇవ్వకుండా, నూతన విద్యా విధానంతో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా రూపొంది స్తు న్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని, అరెస్ట్ అయిన విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ అధ్యక్షులు ఆంజనేయులు రామటెంకి శీను, రాజు, సాయి, హరీష్ పాల్గొన్నారు.
ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట నల్ల జెండాలు ఎగురవేస్తుండగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో హరి విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే టీఆర్ఎస్వీ నాయకుడు చందు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సందర్భంగా వెంకటేష్ గౌడ్, కష్ణ, శ్రీశేలం యాదవ్, రాజు, పెద్దమ్మ నరేష్, నాగరాజు యాదవ్, మిదున్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నల్ల జెండా లతో నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు పి.లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు రెహమాన్, సాయి, భగత్,హరీష్ లను అరెస్ట్ చేశారు. అలాగే ఓయూ జేఏసీ నేతలు మందల భాస్కర్, రవీంద్రనాయిక్, మాదిగ విద్యార్థి సంఘాల ప్రతినిధులు వరిగడ్డి చందు, ఎల్ నాగరాజు సుధాకర్‌లు అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఓయూకు వస్తున్న టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు. శ్రీని వాస్, చటరీ. దాశరద్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను ఓయూ, అంబర్పేట్ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్,ఆడిషినల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ ఆకుల.శ్రీనివాస్, ఇన్స్పె క్టర్ రమేష్ నాయక్‌తో పాటు ఆరుగురు ఇన్స్పెక్టర్, ఎస్ఐ లు 10, ఎఎస్ఐ ఆరుగురు పాల్గొ న్నారు. 42 మంది ని అరెస్ట్ చేశారు.