Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నాసిరకం ఆహారం తింటూ అనారోగ్యానికి గురై చనిపోతు న్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆంద ోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 'విద్యార్థి పోరుబాట' కార్యక్ర మ వాల్ పోస్టర్ ను కృష్ణయ్య చేతుల మీదుగా ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో చేరడానికి విద్యార్ధులు భయపడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని, ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 5 ఏండ్ల క్రితం ధరల ప్రకా రం నిర్ణయించిన మెస్ ఛార్జీలు, స్కాలర్ షిప్ లు నేటికీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. ధరలు పెరగడంతో విద్యా ర్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని ఆరోపించారు. మంత్రులు, ప్రిన్సిపాల్ సెక్రటరీలు, డైరెక్టర్లు ఒక్క రోజు హాస్టళ్ళను సందర్శించలేదని విమర్శించారు. విద్యార్థులకు మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు, ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా, మంచి విద్యా వాతావరణం కల్పించవలిసిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న మెస్ చార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా మార్చాలని డిమాండ్ చేశారు.