Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి సంఘాల ఎన్నికలు ఉండాల్సిందే
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్
నవతెలంగాణ-ఓయూ
అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో కాంట్ర ిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సాధన కోసం ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. వారం, పది రోజుల్లోగా ఉద్యోగుల సీపీఎస్ సమ స్యను పరిష్కరిం చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇందు కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులను రాజకీ యాలకు దూరం చేయటమే పెద్ద కుట్రగా అభివర్ణించిన ఆయన విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు ఉండా ల్సిందేనని అన్నారు. చదువుతో పాటు సమస్య లపై చర్చ, సైద్ధాంతిక చర్చ జరగకపోతే యూనివర్శిటీల ప్రాధాన్యత ఎమిటని ప్రశ్నించారు. ఉత్తర భారతంలో ఉన్న అస్పశ్యత, వెనకబాటుతనం దక్షిణాదిలో ప్రత్యేకంగా తెలంగాణలో లేక పోవటానికి కారణం ఇక్కడ జరిగిన ప్రజాస్వామిక, ప్రగతిశీల ఉద్యమాలే కారణమన్నారు. ఇవ్వాలో రేపో యూనివర్శిటీ రిక్రూట్ మెంట్ బోర్డు మనుగడలోకి వస్తుందని వెంటనే నియామకాల ప్రక్రియ ప్రారంభిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. నిస్పక్షపాతంగా నియామకాలు చేపడతామని ఏవైనా అను మానాలుంటే రాతపూర్వకంగా తెలపాలని కోరారు.
అధ్యాపకులు, ఉద్యోగులకు సీపీఎస్ సాధించిపెట్టే బాధ్యత తనదేనని ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొ. డి. రవిందర్ యాదవ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎన్ని సార్లైనా ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా, సామరస్యపూ ర్వకంగా, ప్రేమతో సులువుగా సాధించవచ్చని స్పష్టం చేశారు. ఆధునికతకు అనుగుణంగా మనమంతా అప్ గ్రేడ్ కావాలని పిలుపునిచ్చారు. సంస్కరణలను ఆహ్వానిస్తూనే ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచిం చారు. యూజీసీ నిబంధనల మేరకు త్వరలోనే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కు ఈసీలో అనుమతి తీసుకుంటామని అన్నారు. తద్వారా సమాజంలోని ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తుల అనుభవాన్ని, పరినాన్ని తరగతి గదుల్లో వినియోగించుకుంటామని వెల్లడించారు. అంతకు ముందు కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రో. కాశీం. సమాజం కోసం, విద్యార్థుల కోసం, విశ్వవిద్యాలయం కోసం కమిట్ మెంట్ తో పనిచేస్తున్న తమకు సీపీఎస్ విధానంతో పాటు పీఆర్సీ బకాయిలు చెల్లించాలని వినోద్ కుమార్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ల పదవీవిరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచటంతో పాటు, పే రివిజన్, సీపీఎస్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులను చేసింది ఓయూ అని యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం అన్నారు. దేశమంతా పాత పెన్షన్ విధానం వైపు వెళ్తుంటే మేం ఇంకా సీపీఎస్ ఇవ్వమని అడుగుతు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే ఓయూ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయబద్దంగా ప్రభుత్వమే విడుదల చేసిన జీవోలను అమలు చేయాలని మాత్రమే తాము కోరుకుం టున్నట్లు ఓయూ ఎన్జీఓస్ అధ్యక్షుడు బియాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఇప్పటికీ తమ సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ప్రభుత్వంపై ఉందని తామంత తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో ఉండి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. అనుమానాలకు స్వస్తి పలికి ప్రభుత్వం ఓయూతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ ప్రొపెసర్స్ గణేష్, కొండ నాగేశ్వరరావు, సరస్వతమ్మ,సీ. యచ్. వెంకటేశ్వర్లు, అంజయ్య, సూర్యదనుంజరు, ఉద్యోగులు శంకర్ నాయక్,రాకేష్, అక్బర్ బేగ్,శివ శంకర్ పాల్గొన్నారు.