Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్్
- జాతీయ సెమినార్లో పాల్గొన్న మంత్రి
నవతెలంగాణ-బంజారాహిల్స్
మీడియా సంస్థల కంటే కూడా మీడియాలో పని చేసే వారి ధైర్యం గొప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ డిపార్టుమెంటు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ''తెలంగాణలో మీడియా, గతం, వర్తమానం, భవిష్యత్తు'' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్‌ను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, గంట చక్రపాణి తదితరులతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తనకు రోజుకి 13 వార్తా పత్రికలు చదవటం అలవాటన్నారు. ఒక్కో వార్త ఒక్కో రకంగా వస్తుందని.. వాటిలో ఏది వాస్తవమో తెలుసుకోడానికి ఎక్కువ పత్రికలు చదవాల్సి వస్తున్నదన్నారు.
మీడియా అకాడెమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లా డుతూ... దేశంలో ఎక్కడా లేనన్ని జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో మాత్రమే అమలవుతు న్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎ.వి.ఎన్.రెడ్డి, విశ్వవిద్యాలయ పాలక మండ లి సభ్యులు, టి-శాట్ సి.ఇ.ఒ. శ్రీ ఆర్. శైలేష్ రెడ్డి, సామా జిక శాస్త్రాల డీన్ ప్రొ. వడ్దానం శ్రీనివాస్‌లు ప్రసంగించారు, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
మొదటి సెషన్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొ. కె. స్టీవెన్సన్ సీనియర్ ఎడిటర్ కె. రామచంద్ర మూర్తి, ఆల్ ఇండియా రేడియో, మాజీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, సుమనస్పతి రెడ్డి, టీవీ ఛానెల్ డిటర్ తోట భావనారాయణ, ఫిల్మ్ జర్నలిస్ట్, చరిత్రకారుడు, హెచ్. రమేష్ బాబు పాల్గొని ప్రసంగించారు.
రెండో సెషన్ లో ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగ మాజీ ఆచార్యులు, ప్రొ.అడపా సత్యనారాయణ, పత్రిక ఎడిటర్ డాక్టర్ కె. శ్రీనివాస్,బుద్దవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర సమాచార కమి షనర్, కట్టా శేఖర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు పి.వేణుగో పాల స్వామి తదితరులు పాల్గొని ప్రసంగించారు. మూడో సెషన్లో తెలుగు విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు ప్రొ. వి.సత్తి రెడ్డి, పత్రిక ఎడిటర్ ఆర్ వి రామారావు, సీనియర్ జర్నలిస్ట్‌లు దాసు కేశవ రావు, ఎస్. జగన్ రెడ్డి, పాలకుర్తి, డా.రాపోలు సత్యనారాయణ తమ పరిశోధనాత్మక పత్రాలను సమర్పించారు.