Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ వెంకటి
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
న్యుమోనియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ వెంకటి అన్నారు. ప్రపంచ న్యూ మేనియా వ్యాధి దినోత్సవం సందర్భంగా ''నవంబర్ పిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కింగ్ కొఠి జిల్లా ఆస్పత్రిలో ''న్యూమోనియా పై అవగాహన కార్యక్రమం శని వారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి హాజరై మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల మరణా లలో 16 శాతం మరణాలు న్యుమోనియా (శ్వాస సంబంధిత వ్యాధుల) ద్వారానే జరుగుతున్నాయన్నారు. దీనికి ప్రధాన కారణము వాతావరణ కాలుష్యం అన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలకు న్యుమోనియా వాక్సినేషన్ వేయించడం ద్వారా మరణాలను వీలైనం తవరకు తగ్గించవచ్చని తెలిపారు. ఆశావర్కర్ ప్రతీ ఇంటికి వెళ్లి చిన్నపిల్లలకు దగ్గు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను గుర్తించి వారికి వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించారు. 5 ఏండ్లలోపు చిన్నారులను గుర్తించి సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా ఆస్పత్రికి పంపవలెనని సూచించారు. చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్. ఆర్ ఎం ఓ డాక్టర్ సాధన. కింగ్ కోఠి క్లస్టర్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ పద్మజ. వైద్యులు తదితరులు పాల్గొన్నారు.