Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
1989లో తార్నాక వెస్లీ స్కూల్లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 33 ఏండ్ల తర్వాత ప్రత్యేకంగా ఓయూ గెస్ట్ హౌస్‌లో శని వారం కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత స్మృతులను టీచర్లు విద్యార్థులు నెమరు వేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. వివిధ రంగాల్లో స్థిరపడి పోయిన వారు కాసేపు ఉత్సాహంగా గడిపారు. గురువులు ఎంతో నైపుణ్యమైన చదువును అందజేయడంతోనే తాము ఈ స్థాయికి ఎదిగామని గుర్తుచేసు కున్నారు. టీచర్స్‌ను వారు సన్మానించారు. పూర్వ విద్యార్థులు దేవేందర్, మల్లేశ్వ ర్ రావు, ఏటుజెడ్ శ్రీని వాస్ రెడ్డి, జి.శ్రీనివాస్, శివ శంకర్, అబీబ్, వినోద్,కుమ్మరి నరసింహ, ఎస్.నరసింహ,రామేశ్వర్, యం.పురుషోత్తం, చింతల్ బాల్ రాజ్, మధు,శ్యాముల్, ప్రిన్సిపాల్ స్వామిదాస్, టీచర్లు గంగాదేవి, దాయామణి, లైజమా పాల్గొన్నారు.