Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధంగా అధికారులు కృషి చేయాలి
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించి నిర్మించతల పెట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలను వేగ వంతంగా పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, అధికారులు పూర్తి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యతో కలిసి వెజ్, నాన్వెజ్, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గుర్తించిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు ఇంకా ఎక్కడైనా స్థలాలు సేకరిస్తే వెంటనే స్థలాలను ఎంపిక చేసిన పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాల విషయంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా తీసుకుని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందనీ, జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వాటి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంర క్షించాలనీ, ఇప్పటి వరకు ఎన్ని రకాల మొక్కలు నాటారు.. అం దులో ఎన్ని బాగా ఉన్నాయని అడిగారు. ప్రభుత్వ సూచనల మేర కు హరితహారంలో మొక్కలు ఎండిపోతే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు తెలిపారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు కూడా పూర్తి కాలేదని వాటిని వెంటనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా చేయాల్సిందిగా సంబంధిత మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ కట్టడాలు, అనుమతిలేని లే అవుట్స్తో పాటు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మిస్తున్న భవనాల విషయంలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని కూల్చివేయా లనీ, ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు, ఒత్తిడులు వస్తే వెంట నే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదే శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రకాల పథకాలు వేగ వంతంగా పూర్తి చేయాలనీ, ఈ విషయాల్లో తత్సారం ఏమాత్రం పనికిరాదని తెలిపారు. అధికారులు చేపట్టే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ననీ, సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావానలి కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జెడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా లోని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, మండలాల ఎంపీడీవో లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.