Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీటను వేస్తూ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం నాగారం మున్సిపాలిటీలోని 12వ వార్డు వెంకటేశ్వర నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు చేరువలో బస్తీ దావకానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అనంతరం 9వ వార్డు విజయపురి కాలనీలో రూ.8 లక్షలతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వాణి రెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.