Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
వైద్యరంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులకు అనుగునంగా శస్త్రచికిత్సలను మరింత వేగంగా, రోగి త్వరగా కోలుకునే విధంగా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో నూతన టెక్నాలజీ ద్వారా శనివారం కిమ్స్ సన్‌షైన్ సికింద్రాబాద్ హాస్పిటల్లో లైవ్ వర్క్‌షాప్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న స్పైన్ సర్జన్లకు ఆబ్లిక్ లంబార్ ఇంటర్ బాడీ ప్యూజన్ (ఓఎల్ఐఎఫ్) పద్ధతిపై అవగాహన కల్పిస్తూ లైవ్‌లో క్లిష్టమైన శస్త్రచికిత్సను చేసి చూపించారు. కిమ్స్ సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టి ట్యూట్ ఆధ్వర్యంలో స్పైన్ సర్జన్లు డాక్టర్ పి.వి.సత్యనారాయణ మూర్తి, స్పైన్ సర్జన్ డాక్టర్ హిమాన్డు, డాక్టర్ ఆంజనేయులు రెడ్డి, డాక్టర్ మురహరి, డాక్టర్ విష్ణు ఈ అరుదైన శస్త్రచి కిత్సలను లైవ్‌లో చేసి చూపించారు. కరీంనగర్‌కు జిల్లాకు చెందిన 45 ఏండ్ల మహిళ ఏడాదిగా కాలంగా నడుం నొప్పితో నడవలేకపోవడం, కాళ్లల్లో తిమ్మిర్లతో బాధపడుతున్న మహిళను పరీక్షించిన డాక్టర్ల బృందం ఆబ్లిక్ లంబార్ ఇంటర్ బాడీ ప్యూజ న్ (ఓఎల్ఐఎఫ్) పద్దతిలో శస్త్రచికిత్సను రెండు గంటల పాటు నిర్వహించారు. ఈ పద్దతిలో శస్త్రబికిత్స చేయడం వల్ల రక్తస్రా వం తక్కువ ఉండటం, త్వరగా కోలుకోవడం, నొప్పి తక్కువ ఉంటుంది. ఈ లైవ్ సర్జరీలో దేశ వ్యాప్తంగా ఉన్న స్పైన్ సర్జన్లు లైవ్‌లో చూడటంతో పాటు వారి సందేహాలను అడిగి తెలుసుకు న్నారు. ఈ లైవ్ సర్జరీలో అమెరికా నుంచి విచ్చేసిన ప్రముఖ సైన్స్ సర్జన్ డాక్టర్ డేనియల్ హెచ్ సిల్కాక్స్ పాల్గొని ఈ ఆధునిక చికిత్స వల్ల కలిగే ఉపయోగాలను తెలియజేశారు. ఈ శస్త్రబికిత్స పట్ల స్పెన్ సర్జన్లుకు అవగాహన కల్పించేందుకే లైవ్ వర్క్‌షాప్‌ను నిర్వహించినట్టు డాక్టర్ సత్యనారాయణమూర్తి ఈ సందర్భంగా తెలిపారు.