Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నివాసంలో కాప్రా డివిజన్ శ్రీ ఎన్ క్లేవ్ ఎన్ఆర్ఐ కాలనీవాసులు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ కమిటీ సభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కాలనీలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని ఎలక్ట్రిసిటీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎన్ క్లేవ్ ఎన్ ఆర్ఐ కాలనీ అధ్యక్షులు కె.అంజయ్య, ప్రధాన కార్యదర్శి నాంపల్లి రవి, ఉపాధ్యక్షులు బి.మురళి, సంయుక్త కార్యదర్శి రమేష్ గౌడ్, కోశాధికారి, తదితరులు అమర్నాథ్ పాల్గొన్నారు.