Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిషనర్ శ్వేతా మహంతి
నవతెలంగాణ-ధూల్‌పేట్
మధుమేహాన్ని తరిమెద్ధామని రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిషనర్, హెచ్‌డీఎస్ చైర్పర్సన్ శ్వేతా మహంతి అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎండోక్రినాలజీ విభాగం ఆధ్వర్యంలో సాధారణ ప్రజలకు మధుమేహ నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్వేతా మహంతి పాల్గొని ఆస్పత్రి ఓపీ మొదటి అంతస్తులో డయాబెటిస్ క్లినిక్, హిమోఫిలియా సెంటర్‌ను సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ బి. త్రివేణి, సీఎస్ అడ్మిన్, ఆర్ఎంఓ, డాక్టర్ బి. శేషాద్రి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ ఎండోక్రినాలజీ డాక్టర్ రాకేష్, ప్రొఫెసర్ డాక్టర్. నీలవేణి, డాక్టర్ మనీషా తదితరులు పాల్గొన్నారు.