Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమైన డంపింగ్ యార్డ్ సమస్యను, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాపాడాలనీ, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలనీ, రూ.కోటి ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేసిన డంపింగ్ యార్డు గోకరాజుకు రోడ్డులో ఏర్పాటు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్యకు ప్రజావాణిలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజ్, ట్రేడర్ సెల్ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు రవి, సీనియర్ నాయకులు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.