Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్
నవతెలంగాణ-బాలానగర్
ఉద్యోగ విరామం వయోవృద్ధులు అందుకునే భవిష్యనిధి కోసం గంటలకొద్దీ నిరీక్షిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో గల పీఎఫ్ (ప్రావిడ్ ఫండ్) ఆఫీసు ఎదుట వయోవృద్ధులు తమ పింఛను తీసుకోవడానికి వస్తున్నారనీ, అధికారుల అలసత్వంతో సమయ పాలనల పాటించక పోవడంతో కూడిన జాప్యంతో ఉండటంతో పింఛన్ కోసం క్యూ లైన్లో నిలబడిన వయోవృద్ధులు గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉదయం నుంచి ఆకలి దప్పికలతో కార్యాలయం ఎదుట నిరీక్షిస్తున్నా అధికారులు తమకేమీ సంబంధం లేనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రన్నారు. సరైన మౌలిక సౌకర్యాలు కూడా కల్పించక పోవడం బాధాకరమన్నారు. తమ డబ్బును దాచుకున్న దాన్ని తీసుకోవాలనుకుంటుంటే గంటలకొద్దీ వేచి చూడాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఎవరికైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నతాధికారులు వీటిని సమీక్షించి సమస్యను పరిష్కారమయ్యే విధంగా చూడాలని, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. లేదంటే కార్మికులందరితో కలిసి పీఎఫ్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు జగన్, బాధితులు నరస య్య, సోమయ్య, మల్లేష్, సుగుణ పాల్గొన్నారు.