Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
బాలల దినోత్సవం సందర్భంగా జీడిమెట్లలోని ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో చిన్నారుల కోసం ఆదర్శ్ స్మార్ట్ కిడ్ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నామని బ్యాంక్ డైరెక్టర్ మదన గోపాలస్వామి తెలిపారు. చిన్న పిల్లల కోసం తమ బ్యాంకులో బాలల దినోత్సవ సందర్భంగా ఈ ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించామన్నారు. బాలల్లో చిన్న వయసు నుంచే డబ్బు విలువ దాన్ని జాగ్రత్తపరచడం నేర్పాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ పథకంలో చేరిన చిన్నారులకు చిన్నారి ఫోటో ఉన్న ఒక ఆకర్షనీయమైన హుండీ బొమ్మను ఇస్తామని తెలిపారు. చైర్మన్ గంగారావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అకౌంట్లో ఏటీఎం, యూపీఐ లావాదేవి జరుపుకునే అవకాశం కూడా కల్పించామని తెలిపారు. తమ 15 బ్రాంచ్లలోనూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం జాతీయ సహకార వారోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్ ఆవరణలో సహకార జెండాను ఎగరవేశారు.