Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- జగ్గంగూడ కొల్తూర్ దారిలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-శామీర్‌పేట
సీఎం కేసిఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచిం తలపల్లి మండలం జగ్గంగూడ గ్రామ పరిధిలోని మటన్ చెరువు వద్ద వంతెన నిర్మాణానికి సోమవారం మంత్రి మేడ్చల్ జిల్లా పరిషత్తు చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్మార్ధం జగ్గంగూడ నుంచి కొల్తూర్ వెళ్ళె రోడ్డు మార్గంలో మటన్ చెరువు వద్ద ఆర్అండ్బీ నిధులు రు.2.5కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనందాస్ హరికమురళిగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మదుకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ బి.శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచులు చందుపట్ల విష్ణువర్ధన్‌రెడ్డి, నల్ల శిల్పాయాదగిరి, ఉప సర్పంచులు బుద్ది శ్రీనివాస్, మండల కో-ఆప్షన్ గౌస్‌పాషా, ఎంపీటీసీ నాగరాజు, వార్డుసభ్యులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు వంగ లక్ష్మారెడ్డి, పొసైటీ డైరెక్టర్ కొండ భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.