Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ గ్రూప్ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రెటినా దెబ్బతినడం వల్ల అంధత్వానికి కారణమయ్యే డయాబెటిక్ రెటినోపతిపై అవగాహన కల్పించేందుకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్స్ వ్యవస్థాప కుడు అండ్ మెంటర్, కో-చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 200 మందికి పైగా ఎన్సీసీ సిక్యాడెట్లు, మ్యాక్సీ విజన్ వైద్యులు, సిబ్బంది, రోగులు, పౌరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నియంత్రణ లేని మధు మేహం ఆందోళనకు ప్రధాన కారణమనీ, ఇది కండ్లతో సహా శరీరంలోని వివిధ ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రతి 7 మందిడయాబెటిక్ పేషెంట్లలో ఒకరు డయాబెటిక్ రెటినోపతి లేదా దృష్టి లోపంతో బాధపడుతూఉన్నారని సర్వే నివేదికలు చెబుతున్నాయన్నారు. నియంత్రణలో లేని చక్కెర స్థాయిలు డయాబెటిక్రెటినోపతికి మూల కారణం అనీ, మధుమేహాన్ని చెకెమేట్ చేయడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి ప్రజలు తప్పనిసరిగా డీఈడీ మంత్రాన్ని (ఆహారం మందులు) పాటించాలన్నా రు. హాస్పిటల్ సీఈఓ సుధీర్ మాట్లాడుతూ 2019 నాటికి భారతదేశంలో 77 మిలియన్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని నివేదికలు తెలియచేస్తున్నాయి నివేదించారు. రెటీనాలో నష్టం శాశ్వత అంధత్వాన్ని కలిగి స్తుందన్నారు తాము మాక్సివిజన్‌లో రెటీనాలో ఏదైనా సమస్య ఉందేమోనని డయాబెటిక్రోగులందరికీ తప్పని సరి ఫండస్ ప్రోటోకాల్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ముందస్తు తనిఖీ వ్యాధిని 50శాతం మధుమేహ గుర్తించడంలో సహాయపడుతుందన్నారు. తమ అంతర్గ త అధ్యయనాల ప్రకారం దాదాపు రోగులు రెటీనాలో తేలికపాటి నుండి తీవ్రమైన సమస్యలను కలిగి ఉన్నట్టు వెల్లడిస్తున్నాయన్నారు. ఇటీవల తాము యూఎస్, బ్రెజిల్ ఆధారిత కంపెనీతో అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనంతో డిజిటల్ ఇమేజింగ్ సిస్టంను కొనుగొన్నట్టు తెలిపారు. ఈ హ్యాండ్ హెల్త్ ఉపకరణం మొత్తం రెటీనాను స్కాన్ చేయగలదు అనీ, ఒక్క నిమిషంలో 10 నుంచి 12 చిత్రాలను అందిస్తుందనీ, రోగిరొటీన్ మార్పులపై అంచనా విశ్లేషలను అందిస్తుందని తెలిపారు.