Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు అన్ని రకాల వినతులకు స్పందిస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య అన్నారు. సోమవారం శామీర్‌పేటలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన 43 వినతులు, ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారనీ, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.