Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
బాలల దినోత్సవం సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని తిరుమలానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు విద్యా నైపుణ్యం పెంచే విధంగా డిజిటల్ క్లాసేస్ ఆక్రితి స్టెమ్ సిబ్బంది, ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పాఠశాలను ఎంపిక చేకున్నందుకు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల పిల్లలకు లర్నింగ్ స్కిల్స్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఉప్పల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలతో కలిసి పని చేస్తుందని తెలిపారు. అనంతరం సైన్స్, మాథ్స్ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ లీడ్ కె.సబిత, రమేష్, ఫీల్డ్ ఆఫీసర్ సద్దాం హుస్సేన్, ప్రధానోపా ధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాకేష్, అనితరాణి, అరుణాదేవి, గాయత్రి, సరిత పాల్గొన్నారు.
శుభాకాంక్షలు..
బాలల దినోత్సవం సందర్భంగా మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలానగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తిరుమలానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేసి, చాక్లెట్స్ పంపిణీ చేసిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మల్లేష్ గౌడ్, ప్రభాకర చారి, నవీన్ యాదవ్, మురళీ కృష్ణ, మహేశ్వరరావు, చంద్రశేఖర్, ఉమా మహేశ్వరి, స్థానిక నాయకులు సుబ్బారెడ్డి, నవీన్ గౌడ్, శేఖర్ గౌడ్, కుమార్, దండెం నరేందర్, తదితరులు పాల్గొన్నారు.