Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేద్దామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నగర నాయకులకు సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కాసానిని సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పి.సాయిబాబా నేతృత్వంలో ఆ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడు తూ టీడీపీని క్షేత్రస్థాయి, డివిజన్ స్థాయి నుంచి పటిష్టపరచడానికి ప్రణాళికలు రూపొందించడానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ భవన్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంద కమిటీ అధ్యక్షులతో సమావే శాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్లమెంటుల వారీగా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయనీ, దానిలో భాగంగానే ఈనెల చివరి వారంలో పార్టీ హైదరాబాద్ జిల్లా విస్తత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబ, వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి బాలరాజగౌడ్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రవీంద్రా చారి, రాష్ట్ర కార్యదర్శులు ప్రకాష్, జాకబ్, రాజునాయక్, నాగు నగేష్, అంజాద్ అలి ఖాన్ పాల్గొన్నారు.