Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏంచేస్తున్నట్లు?
- ఆట స్థలంకు సంబంధించిన గోడ కూల్చివేసి వారం రోజులు అయింది
- కాలనీ సంక్షేమ సంఘం ప్రజాప్రతినిధులకు కానరాలేదా?
నవతెలంగాణ-వనస్థలిపురం
ప్రజా ప్రయోజనానికి కాలనీలో ఆటస్థలం ఏర్పాటు చేసుకుని (ప్రభుత్వ స్థలం) ఇదే విధంగా పలు కాలనీలో ఆట స్థలాలు ఏర్పడ్డాయి. అవి అభివృద్ధికి నోచుకున్నాయి. కానీ ఈ కాలనీలోని ఆట స్థలానికి అభివృద్ధి అనే మాటే లేకుండాపోయింది. పైపెచ్చు ఆటస్థలం చుట్టుపక్కల గృహాల నిర్మాణాలు చోటు చేసుకుని వారు ఆట స్థలానికి సంబంధించిన ప్రహరీ ను పూర్తి చేసి వారికి రహదారిగా ఏర్పాటు చేసుకున్న అధికారులు గానీ ప్రజాప్రతి నిధులుగాని అటువైపు చూడకపోవటం విడ్డూరంగా ఉందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్లు?
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఏ క్వార్టర్స్ హుడా కాలనీ ఫేస్ టు లోని శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం పక్కన ఎన్నో ఏండ్లుగా నెలకొల్పిన ఆట స్థలం కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ నేటికీ పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోకుండా ఎదురుచూస్తుంది. ఈ ఆట స్థలం చుట్టుపక్కల పూర్తి స్థాయిలో గృహ నిర్మాణాలు చేపట్టి కాలనీవాసులు జీవనం సాగిస్తున్నారు. కొన్ని గృహాలకు సంబంధించిన వ్యక్తులు ఆట స్థలం కాంపౌండ్ వాల్ని కూల్చివేసి గతంలో గేటు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా వారం రోజుల క్రితం మరో గృహ యజమాని పార్కు ప్రహరీ గోడను కూల్చివేసి గేటు ఏర్పాటు చేస్తారు? లేకుంటే ఈ పార్కు స్థలాన్ని రహదారిగా ఉపయోగించుకుంటారో. తెలుసు కోవాల్సిన బాధ్యత అధికారులది, తగిన చర్యలు తీసుకో వాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు అటువైపుకు చూడకపోవడం, ఆట స్థలం అభివృద్ధికి నోచుకోకపో వడంపై పలు అనుమానాల్ని కాలనీవాసులు వ్యక్తం చేస్తున్నారు.
ఆట స్థలంకు సంబంధించిన గోడ కూల్చివేసి వారం రోజులు అయింది
జీహెచ్ఎంసికి సంబంధించిన ఆట స్థలానికి సంబం ధించిన ప్రహరీగోడను కూల్చివేసి వారం రోజులైనా అధికారగణం ఏ విధంగా చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆట స్థలంలో ప్రతిరోజు వాకర్స్ వస్తూ ఉంటారు. కానీ ఈ ఆట స్థలాన్ని ఏవిధంగా జీహెచ్‌ఎంసీి అధికారులు అభివృద్ధి చేయకపోవడం, కేవలం చుట్టూరు కాంపౌండ్‌వాల్ నిర్మించి, ఆటస్థలంలో పూర్తిస్థాయి కంకర తేలిపోవటంతో క్రీడాకారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. అభివృద్ధి మాట పక్కన పెడితే ఆట స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడను కూల్చివేసి ఆట స్థలాన్ని కబ్జా గురిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు అధికారుల్ని ప్రజాప్రతిని ధులను కోరుతున్నారు.
అధికారులు, సంక్షేమ సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతుందా?
కాలనీలోని యువకులను క్రీడాకారులుగా తయారు చేసే ఆట స్థలానికి సంబంధించిన ప్రహరీగోడను తొలగించి, గేట్ల ఏర్పాటు చేసుకునే రహదారిగా కబ్జాకు గురిచేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకుల కనుసైగల్లోనే జరుగు తుందా అని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఉన్నత శిఖరాల అధిరోహించే క్రీడాకారులకు సంబంధించిన ఆట స్థలం కబ్జాకు గురికాకుండా, అదేవిధంగా ఆట స్థలం ప్రహరీ గోడను కూల్చివేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.