Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కప్పాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం బడంగ్పేట్లో పుస్తకం - దాని ఉపయోగాలు అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం గ్రంథాలయంలో నిర్వహించిన ఈ పొటీలలో 50 మంది పాఠకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠకులతో ఆయన మాట్లాడుతూ సమాజంలో గ్రంథాలయంలో గ్రంథాలయ పాత్ర యువతీ, యువకులకు ఏ విధంగా ఉపయోగ పడుతుందనే తెలియజేయడం జరిగిందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న రుగ్మతలను తొలగించుటకు వివిధ రకాలైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని కందుకూరి వీరేశలింగం రచించిన కన్యాశుల్కం లాంటి ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో యువతి యువకులకు అవసరమైన పుస్తకాలు, వివిధ దినపత్రికలు, మాస పత్రికలు, అదేవిధంగా పాఠకులు కోరిన విధంగా పుస్తకాలు తెప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది యాదయ్య, జైహింద్, మమత, ప్రసన్న, పిలోత్రి, రాజు, విష్ణు, శరత్, కార్తీక్ పాల్గొన్నారు.