Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
విజ్ఞానం ముందు వైకల్యం అడ్డురాదనీ, దేశంలోని అన్ని రంగాల్లో వికలాంగ మహిళలు సకలాంగులతో పోటీపడుతూ రాణిస్తున్నారనీ, పోటీ ప్రపంచంలోని సాంకేతికను అందిపుచ్చుకోవాలని ఢిల్లీలోని అంబేద్కర్ విశ్వవిద్యాయం ప్రొఫెసర్ అనితాఘారు పిలుపునిచ్చారు. మంగళవారం కార్పొరేషన్లోని బిట్స్ పిలానీలో వికలాంగుల హక్కుల కోసం జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. ప్రపంచం ఐటీని అనుసరింస్తుందన్నారు. వికలాంగ మహిళలు నైపుణ్యం పెంచుకుని అందరికీ ఆదర్శంగా నిలువాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కులను కాపాడాలనీ, వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ప్రతి మహళా స్వశక్తితో ఎదగాలనీ, 'విజ్ఞానమనే ఆయుధంతో వైకల్యం నిర్జవమవుతుందని' చెప్పారు. వికలాంగ మహిళలు చదువుల్లో చురుకుదనం ఉంటుందనీ, చదువుతోనే వైకల్యానికి చెక్ పెట్టొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూడీఎస్ ఢిల్లీ ప్రొఫెసర్ రేణు అడ్లాఖా, ఐడీఎస్ కె.నందనీఘోష్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఘవరెడ్డి, నల్సార్ ప్రొఫెసర్ అమితదండా, టీఐఎస్ఎస్ ముంబై డాక్టర్ బిందులక్ష్మి, ఐఐటీ హైదరాబాద్ శుభ రంగనాథన్, దేశంలోని వివిధ ప్రాంతాల్లో లింగ, వైకల్యంపై పనిచేసే పండితులు, ప్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.