Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
జేఈఈ, ఇతర ఎంట్రెన్స్ టెస్ట్‌లలో విద్యార్దులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ది చెందిన రెసోనెన్స్-హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వారి కాలేజ్ ఫెస్టివల్, 'రెసోఫెస్ట్'ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీఆఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జనార్, ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్ అడవి శేష్, జియో తెలంగాణ సీఈఓ కె సి రెడ్డి, రీసొనెన్స్ - హైదరాబాద్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ఈ రీసోఫెస్ట్ ఉత్సవంలో నగరంలోని వివిధ క్యాంపస్‌ల నుంచి 5000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఆకర్షణీయమైన సాంస్కతిక కార్యక్రమాల ప్రదర్శనతో సందడి చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ మీరంతా మీ కెరీర్లో ఒక ముఖ్యమైన దశలో ఉన్నారనీ, బలమైన భవనం కోసం మంచి పునాది ఎంత అవసరమో ప్రస్తుతం మీరందరూ ఆ దశలో ఉన్నారన్నారు. మీరు మంచి లక్షణాలు, అలవాట్లతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. ఇది అడగడానికి, తెలుసుకోవడానికి సమయం అనీ, తరువాతి దశలలో మీకు సరైన మార్గనిర్దేశం చేసే వ్యక్తులు దొరకకపోవచ్చు అన్నారు. సోషల్ మీడియా ద్వారా మీ వ్యక్తిగత జీవిత వివరాలను పబ్లిక్‌గా ఎప్పుడూ పంచుకోవద్దు అనీ, దీని కారణంగా అనేకమంది అమాయకులు నష్టపోయారనీ, చాలా మంది విద్యార్థులు తప్పుడు అలవాట్లు, తప్పుడు సంబంధాలు పెట్టుకుని చివరికి మోసపోతున్నారనీ, సోషల్ మీడియాలో చేయకూడనివి, చేయదగ్గ వాటి గురించి మీరందరూ బాగా తెలుసుకోవాలన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ ఇలాంటి చక్కటి యువత సాంగత్యంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మనం ఎప్పుడూ ఆశ కోల్పోకూడదన్నారు. యుక్తవయస్సులో ఉన్నవారు భవిష్యత్తు గురించి చాలా గందరగోళంగా ఉంటుందని తెలిపారు. మిమ్మల్ని చూసిన తర్వాత తాను మరింత కష్టపడి మరింత సాధించాలనుకుంటున్నాను అని తెలిపారు. 'విద్యార్థులు తమ తోటి స్నేహితులకు కూడా తెలియని తమలో నిగూఢంగా దాగివున్న ప్రతిభను ప్రదర్శించేందుకు, రోజువారీ చదువుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఈ రెసోఫెస్ట్ ఉత్సవం నిర్వహించాం. విద్యార్థులు తమ జీవితంలోని అత్యంత కీలకమైన పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు మరింత ఉత్సాహంతో తమ చదువులకు తాజాగా తిరిగి పునరంకితమయ్యేందుకు ఈ ఉత్సవం ఒక అవకాశం. అత్యుత్తమ విద్యా పనితీరు కనబరిచిన విద్యార్థులను సత్కరించే అవకాశం కూడా ఇది' అని సజ్జనార్, చిత్ర దర్శకుడు తేజ, అడవి శేషు, కిమ్స్ హాస్పిటల్స్ కిమ్స్ ఉషా లక్ష్మి, సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ రఘురామ్, కెసి రెడ్డి, రీసోనెన్స్ ఎడ్యువెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కె వర్మ వంటి అగ్ర ప్రముఖులతో స్పూర్తిదాయకమైన సంభాషణలు, ముఖాముఖి చర్చలు జరిగాయి. ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి, వైద్య కళాశాలల టాపర్లకు, రెసోఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన సాంస్కతిక, క్రీడా పోటీలలో విజేతలకు అవార్డులను అందజేశారు.