Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
నవతెలంగాణ-కల్చరల్
సమాజంలో సేవ చేసే తత్వం మహోన్నతమైందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఉజ్వల సామాజిక స్వచ్ఛంద సేవ సంస్థ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి సేవారత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వకుళాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొని అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గుర్తింపు రావడానికి అవార్డులు దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఆయా రంగాల్లో సేవలందించాలని సూచించారు. ఉజ్వల సంస్థ విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. వివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సభకు ముందు రీషికా డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ కేరళ ఆయుర్వేద నిపుణులు శివ నరసింహన్, సంఘ సేవకులు విగేష్, సంస్థ అధ్యక్షులు ఎం. లక్ష్మి పాల్గొన్నారు.