Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
- పుస్తకాల ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ-కల్చరల్
జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే గ్రంథాలయాలు ఆధునిక ఆలయాలు అని బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడియో, యూ ట్యూబ్కల్చర్కు అలవాటుపడుతున్న యువత పుస్తకాలు చదవకపోవటం వల్ల ఎంతో కోల్పోతున్నారన్నారు. ఆరోగ్యకర జీవనంలో ఉత్తమ గ్రంథాలు చదవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. నగర కేంద్ర గ్రంథాలయం ఆధునీకరించి విద్యార్థులకు అందుబాటులో ఉంచారని అభినందించారు.
నగర గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనలో పలు గ్రంథాలు ప్రత్యేకించి విద్య సంబంధిత, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఉంచామని తెలిపారు.
కార్యదర్శి పద్మజ నివేదిక సమర్పించారు. పెన్షనర్లు సంఘం అధ్యక్షుడు కె.దేవేందర్, గ్రంథాలయ ఉద్యోగులు అవినాష్, చంద్రకళ, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.