Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
లో ప్రెషర్, కలుషిత నీటి సమస్యను వెంటనే పరిష్కంచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జలమండలి అధికారులకు సూచించారు. మంగళవారం గోల్నాకలోని క్యాంప్ కార్యాలయంలో కమలానగర్, అశోకనగర్, జిందానగర్ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యేను కలిసి లో ప్రెషర్, కలుషిత నీటి సమస్యపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ జలమండలి అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.