Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
డ్రయినేజీ వ్యవస్థలోని లోపాన్ని సవరించాలని కార్పొరేటర్ పావని వినరు కుమార్, యువనాయకులు వినరు కుమార్ అధికారులకు సూచించారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్టీ వారాల పోచమ్మ గుడి నుంచి జవహర్ స్కూల్ వరకు తరచూ డ్రయినేజీ ఓవర్ ఫ్లో సమస్య తలెత్తుతున్న విషయాన్ని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం సీవరేజీ అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుతం ఉన్న సీవరేజీ పైప్లైన్ సైజ్లని క్రమబద్ధీకరించి, నూతన లైన్ల ఏర్పాటుకు కృషి చేసి అమలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రత్న సాయి చంద్, శ్రీకాంత్, సత్తి రెడ్డి, ఆకుల సురేందర్, మేనేజర్ కృష్ణ మోహన్, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్, స్థానికులు పాల్గొన్నారు.