Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
సీసీ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీలో జీహెచ్ఎంసీ ఏఈ ఫరీద్ఖాన్తో కలిసి మంగళవారం సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రయినేజీ పనులు పూర్తయిన అనేక రోజుల తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. డ్రయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణ జాప్యంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్ల నిర్మాణం చేపడుతున్న సమయంలో మ్యాన్ హోళ్లు విరిగిపోతున్నాయని వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చుక్కా జగన్, నాయకులు కోడూరి సురేష్. వెంకటేష్ ముదిరాజ్, మిర్యాల శ్రీనివాస్, ఎడెల్లి భాస్కర్, బాలకృష్ణగౌడ్, పరమేష్ యాదవ్, శివమూర్తి, రాంరెడ్డి, సతీష్, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.