Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పుష్ప చింకా
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు స్కేలర్తో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని 200 శాతానికి పైగా జీతం పెరగడం, తమ ప్రొఫెనల్ ప్రయాణాన్ని స్కేలర్ ప్రోగ్రాంతో మెరుగుపరచుకోవడమే కాకుండా తమ కలల ఉద్యోగాన్ని పొందవచ్చునని ఆంధ్రప్రదేశ్, అమరావతికి చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పుష్ప చింకా విద్యార్థులకు ఆమె గురువారం ఒక ప్రకటనలో సూచించారు. 'కాంపిటేటివ్ కోడింగ్, ప్రోగ్రామింగ్ అంటే నాకు ముందు నుంచి చాలా ఆసక్తి. సర్వీసెస్ కంపెనీలో నేను కెరీర్ ప్రారంభించినప్పుడు, నేను ప్రొడక్ట్ ఆధారిత కంపెనీలో మెరుగ్గా రాణించగలనని భావించాను. అక్కడ నేను ఒరిజినల్ కోడ్ రాయగలను. నేను స్కేలర్ ప్రోగ్రామ్ కోసం నమోదుచేసుకున్నప్పుడు అక్కడి కరిక్యులమ్ పట్ల నేను పూర్తిగా ఆకర్షితురాలినయ్యాను. ఈ ప్రోగ్రామ్‌లో ఒన్ ఆన్ ఇన్ మెంటార్షిప్ అందిస్తారు. నా మెంటార్ నాకు మార్గనిర్దేశనం చేయడంలో అద్భుతంగా తోడ్పడ్డారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నాకు తగిన మార్గనిర్దేశనం చేయడంతో పాటుగా నా సందేహాలను తీరుస్తూ తగిన మద్దతును అందించారు. ఈ
ప్రోగామ్ తర్వాత ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా నా ఆత్మవిశ్వాసం మరింతగా మెరుగుపడింది. తమ కెరీర్ లక్ష్యాలను పొందడానికి, సంబంధితంగా ఉండటానికి అదనపు నైపుణ్యాలను పొందడం అవసరం అని చెబుతాను' అని స్కేలర్ పూర్వ విద్యార్ధిని పుష్ప చింకా అన్నారు. పరిశ్రమ నిపుణులతో స్కేలర్ పనిచేయడంతో పాటుగా సబ్జెక్ట్ నిపుణులతో కలిసి పని చేస్తూ సంభావ్య వర్క్‌ఫోర్స్‌కు భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుందని, పుష్ప అభివద్ధి చెందిన తీరుతో పాటుగా మరింత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల అవసరం గురించి, స్కేలర్ ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో నైపుణ్య అంతరాలనేవి ఇప్పటికీ టెక్ కంపెనీలకు గణనీయంగా ఆందోళన కలిగిస్తున్నాయని, మరీ ముఖ్యంగా సరైన ప్రతిభావంతులను నియమించుకోవడం ఇప్పటికీ సమస్యగానే ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు, ఉద్యోగార్ధులు ఈ పరిశ్రమ అవసరాలను పూరించేందుకు అదనపు నైపుణ్యాలను సంతరించుకోవడం ద్వారా తమ కెరీర్లను మెరుగుపరుచుకోగలరని చెప్పారు. ఈ పోటీ మార్కెట్ వాతావరణంలో ప్రొఫెషనల్స్ పరిశ్రమ సంబంధితంగా ఉండటంతో పాటుగా నూతన తరపు సాంకేతికతలతో తమకు తాము ఆధునికరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు.