Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెటింగ్ హెడ్ బెనర్జీ
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఒక్క యాప్‌తో నచ్చినవి చూడొచ్చు అని, డిష్ నుంచి నూతన ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందరికీ అర్థమయ్యేలా ఉంటుందని మార్కెటింగ్ హెడ్ బెనర్జీ అన్నారు. డిష్ టీవీ ఇండియా నూతన ఓటీటీ యాప్‌ను సోమాజిగూడలోని పార్క్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సింగర్ సింహ, సంస్థ మార్కెటింగ్ హెడ్ బెనర్జీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యాకేజీ రూపంలో వాచో యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించామని చెప్పారు. ఈ యాప్‌లో 11 ఇతర ఓటీటీలను నేరుగా వీక్షించేలా ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో వినియోగదారులు సులభంగా ఆయా ఓటీపీలు అందిస్తున్న సేవలను ఈజీగా వీక్షించవచ్చునని చెప్పారు. జీ5, డిస్పీ హాట్‌స్టార్, సోనీ లైవ్‌తో పాటు ఇతర భాషలకు సంబంధించిన 11 సంస్థల ప్రసారాలు పొందుపరిచారని చెప్పారు. నెలవారి నామమాత్రపు రుసుముతో 11 ఓటీటీలను వీక్షించవచ్చునని సూచించారు.