Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
డిసెంబర్ 3,4వ తేదీలలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న 'తెలంగాణ ప్రాపర్టీ ఎక్స్పో'ను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. గురువారం ఆర్కె పురంలో ఏర్పాటు చేసిన తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ప్రాపర్టీ షోలో వెంచర్స్ స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా వారికి అవసరమైన వాటిని కొనుగోలు చేయవచ్చు అని తెలిపారు. ప్రాపర్టీ షోలో పాల్గొనడం ద్వారా నగరంలో ఎక్కడ త్వరగా అభివద్ధి చెందుతుందనే విషయాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రాపర్టీ షోకి వచ్చిన సందర్శనలకు ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా ద్వారా ఆకర్షణమైన బహుమతి ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో ప్రతి ఒక్కరి సొంతింటి కలను సహకారం చేయడానికి ముందుంటామని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరంలో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, వారి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ముందడుగు వేయాలని తెలిపారు. నగరంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సభ్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.