Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ నగరంలోని ప్రజలకు ఎలాంటి మంచినీటి ఎద్దడి లేకుండా ఉండేందుకుగాను శాశ్వత పరిష్కారం చూపడానికి కృషిచేస్తున్నామని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫేస్-2లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి గడపకు రక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో నిర్మిస్తున్న రిజర్వా యర్లు మరియు పైపులైన్ పనులను మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, హెచ్ఎండబ్ల్యు ఐఎస్, ఎస్బీ జీఏం పి.శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ నుండి పర్వతాపూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దశ్యా ఇంటర్నల్ పైప్ లైన్స్ వేయవలసిందిగా అధికారులకు సూచించారు. గతంలో నగర ప్రజలకు మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేదని పాలకమండలి ఏర్పడిన మొదలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, చామకూర మల్లారెడ్డి సహకారంతో సుమారు 40లక్షల లీటర్ల కేపాసిటీి కలిగిన రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ద్వారా మంచి నీరు ప్రతి ఇంటికి రోజు విడిచి రోజు సరఫరా చేయగలుగుతున్నామని పేర్కొ న్నారు. మిషన్ భగీరథ పథకం ఫేస్-2 ద్వారా హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో 90లక్షల లీటర్ల నీటి సరఫరా సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్లు, పైప్ లైన్స్ నిర్మాణం చేపడుతున్నామని, అవి ఫిబ్రవరి వరకు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ 24గంటలు మంచినీరు సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొల్తూరి మహేష్, టీపీఎస్ రాజీవ్ రెడ్డి, ఏఈ బిక్షపతి, హెచ్ఎం డబ్ఐఎస్, ఎస్బీ డీజీఎం ఈ.నిర్మల, హెచ్ఎండబ్యూఎస్ మేనేజర్ ఎ.రమ్యప్రియ, వర్క్ ఇన్స్పెక్టర్ విజయపాల్ రెడ్డి, ఎన్ సీసీ ఏజెన్సీ ప్రతినిధులు, పాల్గొన్నారు.