Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
అర్హులైన పేదలందరికీి ఇండ్లస్థలాలు ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబ్దుల్లా పూర్మెట్ మండల కేంద్రంలో సర్వే నెంబర్ 283 ప్రభుత్వ భూమిలో గ్రామస్తులందరూ కలిసి గత నెల ఏడో తారీఖు గుడిసెలు వేసుకొని 37 రోజులపాటు గుడిసెలలో జీవనం కొనసాగించారు. అట్టి గుడిసెలను ఈనెల 13వ తారీఖున రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతో గుడిసెలు తీసివేసి, మహిళలు అని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేసి, అరెస్టులు చేయడం జరిగింది. దీనికి నిరసనగా గురువారం తుర్కయంజాల్లోని ఇబ్రహీంపట్నం ఆర్డ్డీఓ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా చేసి ఆర్డీఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యాదయ్య, మండల కార్యదర్శి ఏర్పుల నరసింహులు మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ ఇండ్ల కింద పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన వారందరికీ, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఎన్ని కేసులు పెట్టినా గుడిసెలు వేస్తూనే ఉంటామని అన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని తెలిపారు. అనంతరం ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ కాకుండా ప్రభుత్వం కూడా గతంలో పట్టాలు ఉన్నవాళ్ళకీ ఇండ్ల స్థలాలు ఇచ్చే ఆలోచన ఉందని, మీరు ఏమీ అధైర్యపడకూడదని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు గుండె శివ, చిర్ర శివకుమార్, కిరణ్ ప్రణరు, అనిత, జీవిత, రమాదేవి, మైసమ్మ, లలిత, భాగ్యలక్ష్మి, సంధ్య, పోచమ్మ, బాలమ్మ 40 రోజుల గుర్తులువేసుకొని నష్టపోయిన మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.