Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
కాంట్రాక్టర్లు వివిధ రకాల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తిచేయాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 25వ, 26వ డివిజన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 25వ డివిజన్లోని కమ్యూనిటీ హాల్, 26వ డివిజన్లోని డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించి, త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ రాంప్రసాద్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్లో శ్రీ విద్యా టౌన్షిప్ ఫేస్ 2 కాలనీలో పర్యటించిన మేయర్ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బడంగ్పేట్ క్రీడాస్థలంలో మార్నింగ్ వాకర్స్, ఎసై, కానిస్టేబుల్ కోప్రిపేర్ అవుతున్న అభ్యరులతో కలసి ముచ్చటించారు. మేయర్ వెంట కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్‌రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.