Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రతి ఉద్యోగి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకే ఆర్టీసీ సంస్థ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ సీిహెచ్ వెంకన్న తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కొరకు సంస్థ చేపట్టిన గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంప్ ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ వెంకన్న మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో ఐదు ప్రధాన పరీక్షలతోపాటు సాధారణ పరీక్షలన్నీ నిర్వహించి సంబంధించిన రిపోర్టులను ఉద్యోగి సెల్ ఫోన్‌కు అందిం చనున్నట్లు పేర్కొన్నారు. సంస్థ పూర్తిగా నష్టాలలో కూరుకుపోయి ఆగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్న సమయం లో ఆర్టీసీ ఎండి సజ్జనార్, చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఉద్యోగి నిరంతరం కృషి చేసి లాభాల బాటలోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగు లకు ఇవ్వాల్సిన మూడు డీఏలతో పాటు రోజువారి, నెలవారి ఇన్సెంటివ్‌లను తీసుకోగలుగుతున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఆర్టీసీ తార్నాక దవాఖానాలో అన్ని రకాల సదుపాయాలతో ఆధునికరించి వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ దావాఖాన సంస్థ ఉద్యోగులతోపాటు ఇతర రోగులకు సైతం ఓపి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి 16 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎన్.ఈసు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) మురళీకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) సుబ్రహ్మణ్యం సూపరిండెంట్ వేణుగోపాల రావు, డిప్యూటీ సూపరిండెంట్ అశోక్ కుమార్, సూపర్ వైజరులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.